గాంధీపేరు చెప్పుకునేవారు రాష్ట్ర పొలిమేరలు దాటితే ఖద్దరు ఎందుకు వదులుకుంటున్నారో ఆశ్చర్యంగా ఉంది. గాంధీ మహాత్ముదు లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి కొల్లాయితోనే వెళ్లాడు. భారతీయుడంటే ఏమిటో నిరూపించాడు. ....
రాజకీయం ఒక పవిత్ర యజ్ఞం. నాయకుడుంటే కేవలం త్యాగంతో ప్రజలకు సేవ చేస్వందుకు సుఖాలను, సౌఖ్యాలను కూడా వదులుకొని సామాన్యుల కొరకు సమస్యలను లెక్కచేయకుండా పనిచేసేవాడు. ఈ భావన ప్రజలు మరిచిపోయేంతగా రాజకీయ నాయకులు పాటుపదుతున్నారు. ప్రజలు రాజకీయమంటే దోపిది అని, నాయకుడంటే బందిపోటు అనే భావనలో ఉన్నారు. పరిపాలన అంటే నాయకుల కుటింబాల సంక్షేమం అనుకుంటున్నారు...
రాజకీయ నాయకులు పదవి స్వీకార ప్రమాణ సమయంలో ఏమని ప్రమాణం చేశారో కూడా ఇంగితం లేని మనుషులు. బంధుప్రీతికి, అవినీతికి దూరంగా ఉంటామని చెప్పిన మాటను ఆ రోజే మరిచిపోతున్నారు. gగ్రామిణ ప్రాంతంలో చదువుకున్న ఏ పిల్లాడ్న్రి అడిగినా గాంధీ గురించి ఇదే చెబుతాడు.కాని పాలకులకు గాంధీ అంటే విచిత్రంగా వీరికి గుర్తొచ్చేది నెహ్రూ కుటింబం. జయప్రకాశ్ నారాయణ్, డా.బి.ఆర్.అంబేద్కర్, గాంధీ, నెహ్రూ వీళ్ళంతా వెనకతి తరం వాళ్ళని ఇప్పటి కాంగ్రెస్ వారి భావన. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడి....కమ్యూనిస్టులపై కూడా కులం రంగు అద్దే ప్రయత్నాలు.... అవినీతి కంపు బయటపెడితే పత్రికలపై దాడులు.... ప్రతిపక్షంలో సాధించి లేదు....అధికారం వచ్చిన త్ర్వాత ఆదాయ వనరులను వదిలింది లేదు. పత్రికలు ఉన్నవి ఎపుడూ ప్రజల పక్షాన మాత్రమే. అమాయకమైన ప్రజలు న్మ్మకంతో అధికారంలో కూర్చొబెట్టారు. ఆ బలంతో ప్రపంచమే మెచ్చదగిన పరిపాలన చేయవచ్చు. అధికార ముసుగులో అన్నీ చెల్లుబాటు కావు. ఏమీ చెప్పి మభ్యపెట్టాలనుకుంటిన్నారో, అవి కట్టిపెట్టి ఓటేసిన వాడికి తాగడానికి గుక్కెడు మంచినీళ్లు, ఉండడానికి ఒక ఇల్లు ఇస్తే వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో దాచుకుంటారనే విషయాన్ని విస్మరిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి