21, జనవరి 2010, గురువారం

ఈ కోర్కెలు తీరాలనీ

రాజశేఖరరాజు గారికి,భారతి గారికి,శ్రీగణేష్ గారికి.
మీరంతా మన అమ్మభాష పై మక్కువచూపినందుకు సంతోషం."తెలుగు వ్యుత్పత్తి కో శం" కాపీలు ఆంధ్రావిశ్వవిద్యాలయంలో ఇంకా ఉన్నాయి. తెలుగుజాతి ఇంగ్లీషు, హిందీ, తదితర జాతులతో సమంగా తలెత్తుకొని తిరిగే వాతావరణం రాష్ట్రంలో కలగాలి. ఎవరి భాషను వారు గౌరవించటం, వారి భాషకు సర్వాధికారాలు కలగాలని కోరుకోవటం తప్పు కాదు కదా? తెలుగుకు రెండవ జాతీయ అధికారభాష హోదా, ప్రాచీన భాష హోదా కల్పించాలని కోరుతుంటే.....గొంతెమ్మ కోర్కెలు మానుకోమనీ, ఉట్టికెక్కలేనమ్మ న్వర్గానికి ఎలా ఎక్కుతుందనీ, ఇంట గెలచి రచ్చ గెలవమనీ, అత్యాశ పనికి రాదని.....కొందరు తెలుగు పెద్దలే నాకు చెప్పారు. కాని వారికికూడా అంతరంగంలో వారి మాతృభాష ఉట్టికెక్కాలని,ఇంట గెలవాలని,రచ్చలో కూడా గెలవాలనే ఉంది. ఎంతైనా వారూ తెలుగు బిడ్డలే కదా! కాకపోతే ప్రన్తుత పరిస్థితిని చూని ఇవి తీరే కోర్కెలు కావని నిరాశ.ఎప్పటికైనా ఈ కోర్కెలు తీరాలనీ, తెలుగు బ్రతకాలనీ, తెలుగు ఏలాలని, తెలుగుకు సరైన న్యాయం జరగాలనీ నా ఆశ. నేను ఆశావాదిని. ప్రజల భాషకు పట్టం కట్టడం ఏనాటికైనా తప్పదు. ''మద్రాను లేని తెలుగు రాష్రం తలలేని మొండెం లాంటిది అని అమరజీవి పొట్టి శ్రీరాములు ఎంతగానో వాపోయారు. తెలుగు విద్వాంనులు నంగీత సాహిత్య రంగాలలోనే గాక ఇతర రంగాలన్నింటిలో ఆనాటికే
చెన్నైలో చేసిన అభివృద్ధిని మనం వదులుకున్నాం. బళ్ళారి, బరంపురం లాంటి తెలుగు ప్రాంతాలు కూడా కోల్పోయాం. ఆంధ్ర రాష్రం ఏర్పడిన మరునాడే తెలుగు అనెంబ్లీ తరలి పోవాలని, తెలుగువారి రాజధాని మద్రాసులో ఉండటానికి ఒక్కరోజు కూడా ఆతిద్యం ఇవ్వటం కుదరదని సి. రాజగోపాలాచారి తెగేసి చెప్పాడట. దాంతో తెలుగు నాయకులు కర్నూలుకు వెళ్ళారు. మళ్ళీ అక్కడ్నుంచి హైదరాబాదుకు వెళ్ళారు. ఇలా నిరంతరం వలసలు వెళ్ళే శరణార్థులకు ఆశ్రయ మిచ్చేవారి భాషే వస్తుంది కాని, వారి సొంత భాష వికసించదు. ఏ భాషవారికైతే అత్యధిక నంఖ్యాకులు వారి భాషనే మాట్లాడే సుస్థిర రాజధాని నగరం ఉంటుందో, వారి భాష కూడా నులభంగా రాజ్యమేలుతుంది. రెండు మూడు భాషలవారు అధికార యంత్రాంగంలో ఉన్నపుడు ఒకరి భాష ఒకరికి అర్థంగాక, ఎవరి భాష పెత్తనం కోనం వారు పెనుగులాడుతుంటే, ఇద్దరినీ మర్ధించే మూడో భాష పెత్తనం చెలాయిన్తుంది. ''భాషను ఆధునిక శాన్త్ర సాంకేతిక పదాలతో పరిపుష్ఠం చేసినపుడే ఆ భాషలో చదివే చదువులు ఉపాధి చూపుతాయి అన్నారు రాష్రపతి అబ్దుల్ కలాం. మన భాషలో చదివినవారికి ఉపాధి రంగంలో రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహించినా ఎంతోమంది తెలుగు భాషలోనే శాన్త్ర సాంకేతిక విద్యలు చదవటానికి తరలి వస్తారు.

కోటి విద్యలు కూటి కొరకే కదా!
(తెలుగు అధికార భాషకావాలంటే) పుస్తకంలో నా
ముందుమాట.
ఎవరి తల్లి వారికిష్టం.ఎవరి మాతృభాష వారికి గొప్ప.సంస్కృతాన్ని కాదని LONG LIVE CLASSICAL DIVINE TAMIL అని తమిళులు వారి భాషాభివృధ్ధి కోసం శ్రమిస్తున్నారు.తమిళుల భాషాభిమానానికి వాళ్ళను మెచ్చుకోవాలి.తమిళనాట ముస్లిములు కూడా మసీదుల్లో ఉర్దూ అరబీ భాషలకు బదులు తమిళంలోనే మతవ్యవహారాలు నడుపుకొంటున్నారు.మనం కూడా తెలుగును మన తల్లి భాషగా దేవభాషగా LONG LIVE CLASSICAL DIVINE TELUGU అంటూ గౌరవిద్దాం.మత వ్యవహారాల్లో క్రైస్తవులు ఎలా తెలుగును వాడుతున్నారో అలా మిగతా మతాలు కూడా తెలుగును విస్తారంగా వాడాలి.భాషకు వాడుకే ప్రాణం.వాడని భాష పాడుపడుతుంది.తెలుగుతల్లికి 74 మిలియన్ల బిడ్డలున్నారు.ఒక్కొక్క పదాన్నే కూర్చుకుంటూ పాతికేళ్ళపాటు శ్రమపడ్డ హీబ్రూ ను మించిన పుష్టి తెలుగుతల్లికి ఉంది.సకల విజ్ఞానశాస్త్రాలనూ మనభాషలోకి అనువదించుకొని మన భాషలోనే చదువుకొనే అవకాశాలు కలగాలి.తెలుగులో చదివినా ఉపాధి దొరకాలి.తెలుగులో చదువుదాం ,తెలుగులో వ్రాద్దాం.

ఇవికూడాచూడండిః
http://eenadu.net/vipnew3/display.asp?url=vip-kathalu13.htm
by
telugu blogs