ప్రకృతి సమస్త జీవరాశికి కావలసిన ఆహారాన్ని అందిస్తున్నది. మానవుడు ప్రకృతిపై ఆధారపడుచూ తన జీవనాధారం కొరకు వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. వ్యవసాయంలో భూమి అనేది ప్రధానంగం. మానవుడు తన మేథోసంపత్తితో వివిధ రంగాలలో ప్రవేశించిన వ్యవసాయం తన మనుగడకు తప్పనిసరి అయినది. అనాధి నుండి చేస్తున్న అట్టి వ్యవసాయం నేడు భారమైనది. అష్టకష్టాల కోర్చి పండించిన పంటకు సరైన ధర అందటం లేదు. ఇతర పనులు చేసే అవకాశం లేక తప్పనిసిరై రైతు వ్యవసాయం చేస్తున్నాడని సత్యాన్ని ప్రభుత్వ నివేదికలు కూడా తెలుపుచున్నాయి. మానవాళి మనుగడకు వ్యవసాయ వృత్తి కొనసాగించడం అనివార్యం ఇలాంటి అతిముఖ్యవృత్తికి ప్రభుత్వాల నుండి సరియైన ప్రోత్సాహం లేక ప్రకృతిని నమ్ముకొని రైతు తాను బ్రతుకుచు మిగతా సమాజానికి ఆహారాన్ని అందిస్తున్నాడు. వ్యవసాయ సమస్యలు కొన్ని దైవనిర్ణయానికి, ప్రకృతి నియమావళిపై ఆధారపడగా, చాలా సమస్యలు పాలకుల లోపభూయిష్టమైన విధానాల వల్ల ఏర్పడుచున్నవి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, భూసార పరిరక్షణ సరైన సమయంలో రుణాలు, నీరు, విద్యుత్ సరఫరా గిట్టుబాటుధరలు తదితర సమస్యల పరిష్కారం పాలకుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. తమ పరిధిలోని వ్యవసాయ సమస్యల పరిష్కారం ఆలోచించుటకు బదులుగా రైతుస్వేచ్ఛ, సంపదను, ఉపాధిని హరించే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నమే సహకార వ్యవసాయ విధానం.
రైతులు ఆత్మహత్యలు అరికట్టుటకు తగిన సలహా, సూచనల నిమిత్తమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్, జయతిఘోష్, రామచెన్నారెడ్డిల నేతృత్వంలో వివిధ వేరువేరు కమిటీలను నియామకం చేసింది. ఆ కమిటీలు వ్యవసాయ రంగాభివృద్ధి, అధికోత్పత్తి, రైతు శ్రేయస్సు గూర్చి తమ నివేదికలను ప్రభుత్వాలకు అందజేసినారు. ఆ నివేదికలో సూచించిన అంశాలను అమలుపరచకుండా, సహకార వ్యవసాయ విధానం అనే కొత్త ఆలోచనతో రావడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించక తప్పదు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యలను అరికట్టడం చేతగాక, రైతాంగం సమస్యల పరిష్కారంలో విఫలమై ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే సహకార వ్యవసాయ విధానం.
ప్రతిపాదిత సహాకర సేద్యంలో గ్రామములో రైతులంతా వారికివారే భూములను సహకార సంస్థలకు అప్పగించడం ద్వారా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అనేది ప్రభుత్వ అభిప్రాయం. భూమి అనేది రైతుకు జీవనోపాధితోపాటు సామాజిక, ఆర్థికస్థితికి కారణంగా భావిస్తాడు. తరతరాలుగా ఈ సమాజం భూమిని కల్గి ఉండడం ఒక హోదాగా భావిస్తున్నది. భూమికి రైతుకు మనిషికి పేగుకు ఉన్న సంబంధంలాంటింది. అలాంటి బంధాన్ని రైతు సామాజిక, ఆర్థిక హోదాకు ఫణంగా పెట్టి ఏ రైతు తన భూమిని సహకార సంస్థకు స్వాధీనపరచుటకు ఒప్పుకోడు. ప్రభుత్వ ప్రకటనకు రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామము ముందుకు రాకపోవడం గమనార్హం. రైతు భూమిని స్వాధీనపరచుకుని అతని సామాజిక హోదాను రైతు నుండి కూలీగా మార్చే ప్రయత్నమే ఈ ప్రతిపాదన. రైతుభూమిని స్వాధీన పరచుకుని ఆ భూమి విలువకు సమాన షేర్స్ ఇస్తానంటున్నారు. భూమి విలువ ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు. అందులోని ప్రభుత్వ అవినీతి, అలసత్వత, ఆశ్రిత పక్షపాతం కారణంగా రైతు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే భూమిలేనివారికి కూడా షేర్స్ ఇస్తాననటం ద్వారా అధిక డబ్బున్న కంపెనీలు షేర్స్ కొనుగోలు చేసి సంస్థ ఆధిపత్యం కొనసాగించుకొని రైతును చిన్నచూపు చూసే అవకాశం ఉంది. అలాగే రైతు తన కుటుంబ అవసరాలను వివిధ రకాల పంటలను, పశుపోషణచేసుకుంటు వస్తున్నాడు. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం సంవత్సరానికి ఒకసారి ఇచ్చే డబ్బులో రైతు తన పిల్లల చదువు, శుభకార్యాలు, రోజువారి ఖర్చులుఎలా తీర్చుకోగలుగుతాడో ప్రభుత్వాల విధానంలో స్పష్టత లేదు. గ్రామములోని రైతులందరికీ రోజు పనికల్పించడం సంస్థకు సాధ్యమని గ్రామములోని రైతు కూలీలకు పని కల్పించబడుతుందా? చేతివృత్తులు, వ్యవసాయ అనుబంధం గలిగిన పశుపోషణ, డైరీ, పౌల్ట్రీ, మిల్లింగ్, కులవృత్తులు వారి జీవనోపాధికి ముప్పు ఏర్పడదా? ఇప్పుడున్న గ్రామీణ జీవన విధానంలో వివిధ కులస్థులు, వృత్తుల వారు ఒకరికి ఒకరు సహకారిగా ఉంటూ కష్టసుఖాలలో పాలుపంచుకుంటారు. గ్రామమంతయు మొత్తం ఒక సంస్థ స్వాధీనంలోకి పోయిన పిదప ఆర్ధిక కోణం తప్ప సామాజిక భావన తగ్గి పేదల ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. గ్రామాలలో ఉండే ఆప్యాయత, అనురాగాలు దెబ్బతి, గ్రామీణ జీవనమే అస్తవ్యస్తమవుతుంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణం మెరుగు పర్చుటకు బదులుగా వారిని బానిసబ్రతుకులుగా మార్చే ప్రయత్నమే ఇది?
చిన్నచిన్న కమతాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనుటకు రైతుకు శక్తి చాలుద. చిన్న కమతాల వలన దిగుబడి తక్కువ, యాంత్రీకరణకు చిన్న కమతాలు ఆటంకం రైతు ఆదాయం పెంచే ప్రయత్నానికి చిన్న కమతాల అడ్డంకి. మార్కెట్ పరిజ్ఞానము, ధాన్యం మార్పిడి, గోదాములలో దాచుకోవడం వంటి సహాయ చర్యలను చిన్న రైతులు అవగాహన చేసుకోలేకపోతున్నారు. తద్వార వారి ఆదాయం పెరగటం లేదు. సహకార సంస్థ కంపెనీ ద్వారా మార్కెట్ చిన్న రైతులను ఒడ్డుకు చేర్చేందుకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్పుటకు మార్కెట్లో రైతులకు అనుసంధాన ప్రక్రియకు వీలుకలుగుతుందనే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం సత్యదూరం. మన రాష్ట్రంలోగాని, దేశంలోగాని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవం ప్రకారం చిన్న కారువారే, కాని వారి అధీనంలో ఉన్న భూమి 33శాతం మాత్రమే అట్టి 33 శాతం భూమిలోనే రాష్ట్రంలో సగం వ్యవసాయ ఉత్పత్తులను పండించుచున్నారు. మన దేశంలోనే కాకుండా చైనా, ఈజిప్ట్, వియత్నాం లాంటి దేశాలలో అధిక శౄతం చిన్న కమతాలైనపపటికిని వాటి సరాసరి ఉత్పత్తి పెద్ద కమతాలున్న యూరప్, అమెరికా కంటే ఎక్కువ సన్న చిన్నకారు రైతులు తాను తన కుటుంబ సభ్యులు రేయనక, పగలనక కష్టపడి ప్రత్యేక శ్రద్ధతో అధిక ఉత్పత్తి సాధించుచున్నారు. అందుకే ఈ రోజు పెద్ద కమతాలున్న రైతులు సైతం చిన్నరైతులకే కౌలు ఇవ్వటం గమనార్హం. రైతుకు కావలసిన మౌలిక సదుపాయాలకల్పనపై దృష్టి సారించకుండా ప్రభుత్వతం వితండవాదం చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెటింగ్ వ్యవస్థను రాజకీయ ప్రమేయంతో నిర్వీర్యం చేసింది. రైతు తన ఉత్పత్తులను నిల్వ చేసుకొనుటకు గోదాములే లేవు. ఉన్న గోదాములు సైతం వ్యాపారస్తుల కొనుగోళ్ళ నిల్వకే ఉపయోగపడుచున్నవి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించుటకు యాత్రీకరణకు ప్రభుత్వ ప్రయత్నమేలేదు. తన చేతిలో ఉన్న పనిని చేయని ప్రభుత్వం మరొకరి ద్వారా పనులు చేయిస్తాననటం ఎంతవరకు విశ్వసించవచ్చు. చిన్న సన్నకారు రైతుల భూమిని లాక్కొని వారిని కూలీలుగా మార్చి, వారి స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను, స్వాభిమానాన్ని, జీవనోపాధిని చేపట్టే చర్యే ఈ సహకార సేద్యం లక్ష్యం.
ప్రభుత్వం యాంత్రీకరణ గూర్చి సహకార సేద్యంలో సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న సేద్యంతో సాధ్యపడదు అనే వాదన ఖండించదగినది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల యంత్రాలను రైతులు ఉపయోగించుకుంటున్నారు. కాని అట్టి యంత్రాలు అధిక ధరలతో అందుబాటులో లేని కారణంగా విరివిగా ఉపయోగించుకోలేని స్థితి ఉంది. యంత్రాలపై పన్నులు, సుంకాలను పెంచిన ప్రభుత్వం యాంత్రీకరణ గూర్చి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆగ్రోస్ లాంటి సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే. యాంత్రీకరణ ద్వారా అధిక ఉత్పత్తి సాధించవచ్చనేది పచ్చి అబద్ధం ఇలాంటి అసత్యపు వాదనతో రైతులను మభ్య పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నష్టపరిచే చర్యగా భావిస్తున్నాము.
ప్రభుత్వం ప్రతిపాదిత సహకార సేద్యం రైతులకు లాభం కంటే నష్టం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతిపక్షాలు, రైతు నాయకులు, రైతులు వివిధ రంగాలకు సంబంధించిన నిపుణుల సూచనలను విస్మరించి తొందరపాటుతో సహకార సేద్యానికి పూనుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా సమిష్టి వ్యవసాయ విధానం విజయవంతం కాలేదు. పూర్వపు సోవియట్ రష్యాలో ప్రభుత్వం ఆధీనంలోని వ్యవసాయ విధానంలో ఉత్పత్తి తగ్గి ఆహారకొరత ఏర్పడిన కారణంగా ఆ విధానానికి స్వస్తి పలికినది. చైనా సైతం 1978తదుపరి రైతు భూమిపై వ్యక్తిగత యాజమాన్య హక్కు కల్పించి ఉత్పత్తిపై లాభాన్ని చూపిన తదుపరి బ్రహ్మాండమైన పురోగతిని సాధించింది. 1950వ దశకంలో అప్పటి ప్రధాని జవహార్లాల్నెహ్రుగారు ప్రవేశపెట్టిన సహాకర వ్యవసాయ బిల్లును రైతు నాయకులు వ్యతిరేకించినప్పటికీ బలవంతంగా ఆమోదింపచేసిన ఆ ప్రయోగం ప్రయోజనం లేకుండా పోయింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన ఇజ్రాయిల్ విధానం అక్కడి రైతులకు లాభంకంటే ఎక్కువ నష్టాలను చవిచూపింది. మన రాష్ట్రంలో నష్టాలపాలైన చక్కెర, డైయిరీ, సహకార బ్యాంకుల అనుభవాల నుండి గుణపాఠం నేర్చుకోకుండా ఈ సహకార సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం రైతు వ్యతిరేక చర్య రాష్ట్రంలోని సహాకార బ్యాంకుల వైఫల్యాలను గమనించవలసిన అవసరం ఉంది. సహాకార సంఘాలు రైతులకు లాభం చేకూర్చకపోగా వారి వాటా ధనాన్ని కూడా ఇవ్వకపోవడం గమనార్హం. రాజకీయ జోక్యం, అవినీతి, సహకార స్ఫూర్తి కొరవడడం ఈ సంస్థల వైఫల్యానికి ప్రధాన కారణాలు అని నిపుణుల సూచనలు విస్మరించి మరో ప్రయోగానికి పాటుపడటం రాజకీయ
27, ఆగస్టు 2009, గురువారం
17, జూన్ 2009, బుధవారం
9, మే 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)












.jpg)



.jpg)




























.jpg)


