





వివాహం...మరణం మాత్రమే వడదీయగల సుదీర్ఘ పయనం.....అంతటి ప్రాధాన్యం ఈ బంధానిది. పెళ్లంటే పందిళ్లు....తప్పిట్లు....తలంబ్రాలు...ఈ మహోత్సవానికి వధూవరుల తరుపు బంధువులు...హితులు...స్నేహితులు ఆశీర్వచనాలు... ఆడంబరాలు...మూడు ముళ్లు... ఏడడుగులు...ఇంతటి ప్రాధాన్యం. వైశిష్టం ఉంది. పెళ్లికి ఈ ఆధునిక కాలంలో మనిషి జీవనం కాలం కంటే వేగంగా పరుగిడుతోంది. ఆ కోవలోనే వివాహ మహీట్సవం సైతం అతివేగంగా ఓ తంతుల మారింది. వివాహం, రిసెప్షన్ రెందు రోజుల ముచ్చటయింది. వేగవంతమైన జీవనంలో పెళ్లికి వచ్చిన వారంతా ఎంత తొందరగా ముగించుకొని వెళదామా అన్న ఆలోచనలో ఉండడంతో వివాహం కూడా రెండు రోజుల వేడుకగా కుదించకతప్పడం లేదు.అందరితో గడపాలని ఉన్నా తప్పని పరస్థితులు... రెండు రోజుల వేదుకకు ఏర్పాట్లు చేసుకోవడానికే ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో నేడు చాలా వరకు కల్యాణ్ మంటపాల్లోనే వివాహాలు, రిసెప్షన్ లతో వివాహ వేడుకలు ముగిస్తున్నారు. శాస్త్రబద్ధంగానే పేళ్లిళ్లు జరుగుతున్నా సమయ పాలనలో అంతా వేగం. వధూవరుల స్వగృహాలకు బంధు, మిత్రులు కుటుంబసమేతంగా హాజరై విడిది చేస్తే కళకళలాడేవి ఒకప్పుడు. నేడు వారంతా కల్యాణ్ మంటపానికే పరిమితమవుతున్నారు. లగ్న పత్రిక నుంచి వివాహానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు అన్నీ మారిపోయాయి. రెండున్నర దశాబ్దాలకు నేటి పెళ్లిళ్లకు పోల్చుకుంటే ఏన్నో మార్పులు మనముందు కదలాడుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి